Home > తెలంగాణ > CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన చినజీయర్ స్వామి

CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన చినజీయర్ స్వామి

CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన చినజీయర్ స్వామి
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి రేవంత్ తో చినజీయర్ భేటీ అయ్యారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన చినజీయర్ స్వామి.. సీఎంగా ఎన్నికైనందుకు రేవంత్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ కు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. అనంతరం ఆయనను ఆశీర్వదించారు. కాగా గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ తో చినజీయర్ స్వామి సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు విషయాలలో నాడు కేసీఆర్ చినజీయర్ స్వామి సూచనల మేరకు నడుచుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొంతకాలం తర్వాత కేసీఆర్.. చినజీయర్ మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ అదంతా వట్టి ప్రచారమేనని ఇటీవల చినజీయర్ స్వామి కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత స్పష్టమైంది. తాజాగా చినజీయర్ స్వామి రేవంత్ ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated : 19 Feb 2024 5:12 PM IST
Tags:    
Next Story
Share it
Top