'ప్రజా పాలన'కు నోడల్ అధికారుల నియామకం
X
రేపటి నుంచి రాష్ట్రంలో 'ప్రజా పాలన' కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తాజాగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్- శ్రీ దేవసేన, మహబూబ్ నగర్- టీకే శ్రీదేవి, ఖమ్మం- ఎం.రఘునందన్ రావు, రంగారెడ్డి -ఇ.శ్రీధర్, వరంగల్ -వాకాటి కరుణ, హైదరాబాద్- కె.నిర్మల, మెదక్ -ఎస్.సంగీత, ఆదిలాబాద్- ఎం.ప్రశాంతి, నల్గొండ- ఆర్.వి.కర్ణన్, నిజామాబాద్- క్రిస్టినా చోంగ్తూలను నోడల్ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులపై పెట్టింది.