Home > తెలంగాణ > TSRTC MD VC Sajjanar : భక్తులకు శుభవార్త.. ఇక ఇంటికే సమ్మక్క-సారక్క ప్రసాదం

TSRTC MD VC Sajjanar : భక్తులకు శుభవార్త.. ఇక ఇంటికే సమ్మక్క-సారక్క ప్రసాదం

TSRTC MD VC Sajjanar : భక్తులకు శుభవార్త.. ఇక ఇంటికే సమ్మక్క-సారక్క ప్రసాదం
X

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి TSRTC శ్రీకారం చుట్టింది. గత జాతరలాగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది.

భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. https://rb.gy/q5rj68 లింక్‌ పై క్లిక్‌ చేసిగానీ లేదా పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌ లోనూ అమ్మవార్ల ప్రసాదానికి ఆర్డర్ ఇవ్వొచ్చు. మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033ను గానీ సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.

Updated : 13 Feb 2024 1:40 PM GMT
Tags:    
Next Story
Share it
Top