Home > తెలంగాణ > రేపు హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్.. ఫ్యాన్స్కు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

రేపు హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్.. ఫ్యాన్స్కు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

రేపు హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్.. ఫ్యాన్స్కు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
X

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మీడియాకు తెలియజేశారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 24 డిపోల నుంచి ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌లకు ఈ బస్ సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. చివరగా సాయంత్రం 7 గంట‌లకు స్టేడియం నుంచి బస్సులు బ‌య‌లుదేరుతాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌ని క్రికెట్ అభిమానుల‌ను ఆయన కోరారు.

కాగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపు ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యంత ఆధునికంగా ఉప్పల్ స్టేడియాన్ని రెడీ చేశారు. స్టేడియం టాప్ తో పాటు స్టేడియంలోని కుర్చీలను కూడా మార్చారు. ఇక మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.అదే విధంగా సైనిక కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పించారు.

Updated : 24 Jan 2024 3:16 PM IST
Tags:    
Next Story
Share it
Top