Home > తెలంగాణ > తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. అయోధ్యకు రెండు రైళ్లు

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. అయోధ్యకు రెండు రైళ్లు

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. అయోధ్యకు రెండు రైళ్లు
X

ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకకు ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, గవర్నర్లతో పాటు క్రీడా, బిజినెస్, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా ఈ నెల 23 నుంచి శ్రీరాముడి దర్శనం సామాన్య ప్రజలకు కూడా కలగనుంది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల గుండా రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోను ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది.

గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (కాచిగూడ మీదుగా)

యశ్వంతపుర నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (15024) కాచిగూడ మీదుగా అయోధ్యకు వెళ్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 నిమిషాలకు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడలో బయల్దేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, కాచికూడా, ఖాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. మొత్తం ఒకటిన్నర రోజుల పాటూ ఇందులో ప్రయాణించాల్సి ఉంటుంది.

శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (విజయవాడ మీదుగా)

తమిళనాడు లోని రామేశ్వరం నుంచి విజయవాడ మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (22613) కూడా అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి 1813 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున 4.00 అయోధ్య జంక్షన్‌కు చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమేఈ ఆగుతుంది.

Updated : 11 Jan 2024 9:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top