Home > తెలంగాణ > మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, అందుకు కావాల్సిన ప్రక్రియను త్వరలోనే మొదలుపెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మేడారం వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం తన నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. తర్వాత రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, కానీ జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని అన్నారు. మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామని అన్నారు. మేడారం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారని తెలిపారు. ఇక ములుగులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన తాత్కాలిక క్యాంపస్ ను ఏర్పాటు చేసి ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఉంటుందని అన్నారు. గిరిజన యూనివర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తామని తెలిపారు. త్వరలోనే ప్రధాని మోడీ గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన భవనానికి భూమి పూజ చేస్తారని అన్నారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ లో క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని అన్నారు. రామప్ప అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రామప్ప ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ విషయంలో గత ప్రభుత్వానికి భూసేకరణ గురించి లేఖ రాశామని, కానీ వాళ్లు అదేది పట్టించుకోలేదని అన్నారు.




Updated : 22 Feb 2024 9:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top