విలువలకు మారుపేరు వాజ్పేయ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X
విలువలకు మారుపేరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ వాజ్పేయ్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించింది. ఇక వాజ్పేయ్ జయంతి సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాజ్పేయ్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తక్కువ వస్తే తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి వాజ్పేయ్ అని అన్నారు. ఆయన జీవితాంతం విలువలకు కట్టుబడి ఉన్నారని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని వదలలేదని అన్నారు. ఇక ప్రధానిగా దేశంలోని పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఆయన హయాంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని అన్నారు. వాజ్పేయ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని ఆయన కేంద్రమంత్రి సూచించారు.