మేడారం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కోళ్లు, గొర్రెలకు ప్రవేశం లేదు
X
మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ ముఖ్య సూచన చేసింది. మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు ఎంట్రీ లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని సజ్జనార్ కోరారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.
ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మేడారంలో 15 కిలోమీటర్ల మేర 48 క్యూ లైన్లు ఏర్పాట చేసినట్లు చెప్పారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని ఎండీ సజ్జనార్ సూచించారు. కాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ సారి ఎక్కవ మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సమేతంగా వెళ్లేవారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే ఛాన్స్ ఉండగా.. వ్యక్తిగతంగా వెళ్లాలనుకునే మహిళలు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగించుకోనున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.