Home > తెలంగాణ > ఇష్టం లేకుంటే వెళ్లిపోండి.. ఎమ్మెల్యే పల్లాతో మంత్రి సురేఖ

ఇష్టం లేకుంటే వెళ్లిపోండి.. ఎమ్మెల్యే పల్లాతో మంత్రి సురేఖ

ఇష్టం లేకుంటే వెళ్లిపోండి.. ఎమ్మెల్యే పల్లాతో మంత్రి సురేఖ
X

కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలని హరిత హోటల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి కొండా సురేఖతో పాటు బీఆర్ఎస్ కు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి స్టేజీ మీదకు రావాల్సిందిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని మంత్రి కోరారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారిక సమీక్షలో ఓ పార్టీ నేతను ఎలా పిలుస్తారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ మీటింగ్ కాదని, రాజకీయ వేదిక కాదని అన్నారు. రాజకీయ వేదిక లాగా ఓడిపోయిన వారిని వేదికపైకి ఎలా పిలుస్తారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపొండి అని పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ అన్నారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.




Updated : 30 Dec 2023 9:13 PM IST
Tags:    
Next Story
Share it
Top