Home > తెలంగాణ > కేసీఆర్కు రేవంత్కు తేడా అదే.. విజయశాంతి

కేసీఆర్కు రేవంత్కు తేడా అదే.. విజయశాంతి

కేసీఆర్కు రేవంత్కు తేడా అదే.. విజయశాంతి
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి సీఎం కేసీఆర్ పాలనకు నేటి రేవంత్ రెడ్డి పాలనకు ఎంతో తేడా ఉందని అన్నారు. కేసీఆర్ హయాంలో పని దినాలు సెలవు దినాలుగా.. సెలవు దినాలు యధావిధిగా సెలవు దినాలుగా నడిచాయని విమర్శించారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో అవసరమైతే సెలవు దినాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేస్తున్నారని అన్నారు. రేవంత్ హయాంలో నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన.. నాటి కేసీఆర్ పాలన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ తేడా ఏందో అనేది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకున్నాక అర్థమవుతుందని అన్నారు. కాగా మొన్నటి దాక బీజేపీలో ఉన్న విజయశాంతి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Updated : 24 Dec 2023 8:34 PM IST
Tags:    
Next Story
Share it
Top