Home > తెలంగాణ > డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కేస్లాపూర్ గ్రామస్తులు

డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కేస్లాపూర్ గ్రామస్తులు

డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కేస్లాపూర్ గ్రామస్తులు
X

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కేస్లాపూర్ గ్రామస్థులు కలిశారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆధ్వర్యంలో వాళ్లు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేస్లాపూర్ లోని మెస్రం వంశస్థుల ఆరాధ్య దైవమైన నాగోబా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని వారు భట్టిని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహిచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని తెలిపారు. నాగోబా జాతరకు కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ జాతరను కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భట్టి తెలిపారు.

Updated : 3 Jan 2024 4:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top