Home > తెలంగాణ > Ex MP Vinod Kumar : 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం..

Ex MP Vinod Kumar : 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం..

Ex MP Vinod Kumar : 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం..
X

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేసిందని అన్నారు. కానీ తాము తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మొత్తం 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. రాష్ట్రంలో ఇంకా లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, వాటన్నింటిని నెల రోజుల్లో గుర్తించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ రెండు లక్షల ఉద్యోగాలను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ కు ఓ ఎమ్మెల్సీగా బాధ్యతలు పెరిగాయని, ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎన్నో రకాలుగా ఆలోచించి గత ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తామంటూ ప్రకటనలు ఇస్తోందని అన్నారు. అలా చేస్తే ఉద్యోగాల భర్తీ ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు. అది ఉద్యోగాల భర్తీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తమ పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటోందని అన్నారు. పేర్లు మారిస్తే ఏం ప్రయోజనం ఉండదని, అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని అన్నారు. గతాము, బీజేపీతో కుమ్మక్కు అయ్యామంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని, కానీ త ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని ఆరోపించారు. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్ స్వార్ధ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ లో చేరారని అన్నారు. ఆయన పార్టీని వీడటం వల్ల బీఆర్ఎస్ కు కలిగిని నష్టమేమీలేదని అన్నారు. పార్టీ మారగానే పక్క పార్టీపై విమర్శలు చేయడం నైతికత అనిపించుకోదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చూసినా ఈ నెల 13న నల్గొండలో జరగాల్సిన కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకోలేదని అన్నారు. నల్గొండలో సభ పెట్టి కేఆర్ఎమ్బీకి కృష్ణా జలాలను అప్పగిస్తే వచ్చే నష్టం గురించి అక్కడి ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.

Updated : 7 Feb 2024 9:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top