Home > వైరల్ > కళాకారుల కాళ్లు మొక్కిన సీఎం.. ఎందుకో తెలుసా?

కళాకారుల కాళ్లు మొక్కిన సీఎం.. ఎందుకో తెలుసా?

కళాకారుల కాళ్లు మొక్కిన సీఎం.. ఎందుకో తెలుసా?
X

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా హరియాణాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కడి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి కళాకారుల కాళ్లకు దండం పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని కర్నాల్ లో శుక్రవారం రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అక్కడి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు పలువురు ప్రముఖుల హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే శ్రీ రాముడు, లక్ష్మణుడు, సీత వేషాల్లో ఉన్న కొందరు కళాకారులు నృత్యం చేస్తున్నారు. ఇక వారి ప్రదర్శన ముగియగానే సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్టేజీ దిగి వారి వద్దకు వెళ్లి రామలక్ష్మణుల వేశంలో ఉన్న కళకారుల కాళ్లకు మొక్కారు.

అయితే ఆ కళాకారుల వద్దని సీఎంను వారించే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన ఆ కళాకారులతో కొంతసేపు ముచ్చటించారు. కాగా కళాకారుల కాళ్లకు హరియాణా సీఎం దండం పెట్టిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సింప్లిసిటీ, దైవభక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు 'యూ ఆర్ రియల్లీ గ్రేట్ సార్' అంటూ కామెంట్ చేస్తున్నారు.




Updated : 26 Jan 2024 6:11 PM IST
Tags:    
Next Story
Share it
Top