హిజ్రాగా మారిన ఇద్దరు పిల్లల తండ్రి.. భార్య ఏం చేసిందంటే?
X
ఇద్దరు పిల్లల తండ్రి ఓ హిజ్రాగా మారి ఏడేళ్లుగా తన కుటుంబానికి దూరంగా ఉంటున్న ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..లక్ష్మణరావు అనే వ్యక్తి 7 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి పారిపోయాడు. అప్పటికే ఆయనకు పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక భర్త సడెన్ గా కనపడకుండా పోయేసరికి భార్యాపిల్లలు ఆందోళన చెందారు. తెలిసిన వాళ్ల దగ్గర ఆచూకీ కోసం ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయేసరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయినా ఆయన గురించి తెలియకపోవడంతో ఆశలు వదులుకున్నారు. అయితే ఇటీవల కన్నడ బిగ్ బాస్ షోలో వనజాక్షి అనే హిజ్రా పాల్గొంది. ఆ వీడియో చూసిన భార్యకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వనజాక్షిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఇక విచారణ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇంట్లో నుంచి పారిపోయిన లక్ష్మణరావే ఈ వనజాక్షి అని తేలింది. తనకు స్త్రీగా ఉండటం ఇష్టమని, అందుకే లింగమార్పిడి చేయించుకున్నానని అతడు ఒప్పుకోవడంతో భార్య అక్కడే మూర్ఛపోయింది. అనంతరం పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించివేశారు. కాగా నీతూ జనజాక్షి ఇటీవల జరిగిన కన్నడ బిగ్ బాస్ 10లో పాల్గొంది. కిచ్చా సుదీప్ యాంకర్ గా నడిచిన ఈ ప్రోగ్రామ్ లో ఏకంగా 8 వారాల పాటు వనజాక్షి బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. కెప్టెన్ కూడా అయ్యారు. ఈ షో తోనే ఆమె బాగా పాపులర్ అయ్యారు.