భయపెట్టేలా సన్నీ లియోన్ 'మందిర' ఫస్ట్ లుక్

Update: 2024-04-19 12:02 GMT

ప్రస్తుతం కాన్సెప్ట్ బేస్డ్ గా సాగే హారర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను డబుల్ చేసేలా బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘మందిర’. ఈ మూవీలో సన్ని లియోన్ ఇంతకు ముందెప్పుడూ కనిపించని పాత్రలో కనిపించబోతోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా మందిర చిత్రానికి సంబంధించిన టైటిల్, సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సన్నీ లియోన్‌ను ఈ పోస్టర్‌లో గమనిస్తుంటే భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.

Tags:    

Similar News