టీటీడీ చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే

Update: 2023-08-05 12:59 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవికాలం ఇంకో వారం రోజుల్లో ముగియనుంది. 2019 నుంచి ఆయన టీటీడీ ఛైర్మన్గా ఉన్నారు. దీంతో కొత్త ఛైర్మన్ ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన జగన్ ప్రభుత్వం.. భూమనను ఛైర్మన్గా నియమించింది .

వైఎస్సార్ హయాంలో భూమన టీటీడీ ఛైర్మన్గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పాలకమండలిలో ఛైర్మన్తో పాటు 35మంది సభ్యులు ఉన్నారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

bhumana karunakar reddy appointed as ttd chairman

ttd chairman,bhumana karunakar reddy,tirupati mla,cm jagan,ap cm,tirumala updates,

Tags:    

Similar News