తమిళనాడులో అర్చకులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరాది, దక్షిణాది వర్గాల అర్చకుల మధ్య గొడవ జరగింది. నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు. ప్రభందాలు పాడే హక్కుపై వడకళై - తెంకలై వర్గాల అర్చకుల మధ్య ఘర్షణ చెలరేగింది. 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం ప్రసిద్ధమైనది. అయితే ఈ ఉత్సవాల ఊరేగింపులో ప్రభందాలు పాడే విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తెంకలైలు తమిళంలో కీర్తనలు పఠించడంతో వడకళైలు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ప్రస్తుతం అర్చకులు కొట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Kalesh in #Kanchipurampic.twitter.com/FqFrjeSdIz
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) January 18, 2024