శ్రీశైల దేవస్థానంలో అపచారం.. పులిహోర ప్రసాదంలో చికెన్ బొక్కలు

By :  Bharath
Update: 2024-02-09 11:46 GMT

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల దేవస్థానాన్ని రోజు కొన్ని వేల మంది భక్తులు దర్శించుకుంటారు. మల్లన్నకు మొక్కులు చెల్లించి పునీతులవుతుంటారు. నిష్ఠగా ఉపవాస దీక్షలు చేసి.. ప్రసాదం తిని ఉపసంహరించుకుంటారు. ఈ క్రమంలో దేవస్థానంలో దేవుడికి నైవేధ్యం పెట్టి, భక్తులను విక్రయించే పులిహోర ప్రసాదంలో మాంసం ముక్కలు రావడం కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయ పరిధిలోని.. భ్రమరాంబ ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం ఉంటుంది. అక్కడే ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. పులిహోరం ప్రసాదం కొనుగోలు చేసిన భక్తుడు హరీశ్ రెడ్డి.. ప్యాకెట్ తెరిచి తినగా అందులో మాంసపు ఎముకలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన హరీశ్.. దేవస్థానం అధికారులపై సీరియస్ అయ్యాడు. లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్య క్షేత్రంలో ఇలాంటి తప్పులు జరగడం ఏంటని మిగతా భక్తులు అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. పులిహోరలో మాంసపు ఎముకపై రావడంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని భక్తుడు హరీశ్ రెడ్డి సూచించాడు.




Tags:    

Similar News