Medaram Jatara : మేడారం జాతరకు 3కోట్ల కేంద్ర నిధులు.. ప్రత్యేక రైళ్లు, బస్సుల వివరాలివే

Byline :  Bharath
Update: 2024-02-17 03:29 GMT

మరికొద్ది రోజుల్లో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. దీంతో సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో జనం మేడారం బాటపట్టారు. లక్షల మంది భక్తుల రాకతో మరో కుభమేళాను తలపిస్తుంది మేడారం. కాగా మహాజాతరకు చేరేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి.. సకల సౌకర్యాలను కల్పించింది. మేడారం జాతర కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం (ఫిబ్రవరి 18) నుంచి ప్రత్యేక బస్సులు, ఫిబ్రవరి 21 నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం 9:52 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు ప్రత్యేక రైలు ఉంటుంది. మధ్యాహ్నం 12:12కు కాజీపేటకు, ఒంటిగంటకు వరంగల్ కు చేరుకుంటుంది. తిరిగి అదే రైలు మధ్యాహ్నం 1:55 గంటలకు వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 6:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈనెల 21 నుంచి 25వ తేదీవరకు ఈ రైలు నడుస్తుంది.

నిజామాబాద్ నుంచి కూడా ప్రత్యేక రైలును ఏర్పాటుచేశారు. ఈ రైలు సికింద్రాబాద్ మీదుగా కాజీపేట, వరంగల్ కు చేరుకుంటుంది. ఉదయం 7:05కు నిజామాబాద్ లో బయలుదేరి సికింద్రాబాద్ కు 11 గంటలకు చేరుకుటుంది. వరంగల్ కు 1:45కు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం వరంగల్ లో 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. రాత్రి 10:30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ నెల 21 నుంచి 24 తేదీల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. ఒక్క వరంగల్‌ నుంచే సుమారు 2,500 బస్సులను నడపనుండగా కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా బస్సులను నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.




Tags:    

Similar News