శబరిమల 18 మెట్లు ఇక వర్షానికి తడవవు.. వావ్, అద్భుతం!

Update: 2023-11-17 16:08 GMT

కోట్లాది భక్తుల పవిత్ర దైవం అయ్యప్పస్వామి కొలువైన శబరిమల ఆలయం కొత్త కళ సంతరించుకుంది. ఆలయం ముంగిట్లోని 18 మెట్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. మెట్లకు ముందు నగిషీలతో తీర్చిదిద్దిన రాతి స్తంభాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. అలాగే, మెట్లు వర్షానికి తడవకుండా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ కప్పు కూడా ఆకట్టుకుంటోంది. వర్షం సమయంలో సోపానాలకు రక్షణగా, భక్తులు ఇబ్బంది పడకుండా ఈ రూఫ్‌ను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ విశ్వసముద్ర ఈ కప్పును రూపొందించింది. మెట్లకు అటువైపు ఇటువైపు ఉన్న స్తంభాలమీది కప్పు మూసుకుని రక్షణ కల్పిస్తుంది. వర్షం లేనప్పుడు కప్పును తీసేయొచ్చు. గత ఏడాది రూ. 70 లక్షల వ్యయంతో దీని నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి కొలిక్కి వచ్చాయి. భక్తులు మెట్ల ముందున్న రాతి స్తంభాలను, కప్పులను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయ్యప్ప ఆలయాన్ని గురువారం తెరవడంతో శబరిగిరులు స్వామివారి నామోచ్చారణతో హోరెత్తున్నాయి.


Tags:    

Similar News