అమ్మవారికి కానుకలుగా 207 కిలోల బంగారం, 354 వజ్రాలు.. ఎక్కడంటే..

Update: 2023-06-14 16:07 GMT

హుండీ ఆదాయంగా.. 207 కిలోల బంగారు ఆభరణాలు, 1280 కిలోల వెండి, 354 వజ్రాలు వచ్చాయి. అయితే, ఇవేవీ నెలల తరబడి వచ్చిన ఆదాయం కాదు. కేవలం.. వారం రోజుల పాటు లెక్కిస్తే తేలిన లెక్కలివి. ఇంతకీ ఇన్ని కానుకలు ఎక్కడ వచ్చాయని ఆశ్చర్యపోతున్నారా? ఈ కానుకలన్నీ తుల్జాపూర్ భవానీ ఆలయానికి భక్తులు సమర్పించినవే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ కానుకలన్నింటినీ యంత్రాంగం ఇప్పుడు లెక్కిస్తోంది. ప్రతి ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 35 మంది హుండీ కానుకలను లెక్కిస్తారు. మరో రెండు వారాలు కానుకల లెక్కింపు కొనసాగుతుంది.

Tags:    

Similar News