టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతోంది. రీసెంట్గా కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వరుణ్, లావణ్యల నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. ఎంగేజ్మెంట్కి సంబంధించిన పిక్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నారు. లేటెస్టుగా ఈ కాబోయే కపుల్‌కి సంబంధించి ఓ రూమర్ నెట్టింట్లో షికారు చేస్తోంది. ఓ యంగ్ హీరో కారణంగా వీరిద్దరి మధ్య పెద్ద ఫైట్ అయ్యిందనే వార్త వైరల్ అవుతోంది. పెళ్లికి ముందే వరుణ్ లావణ్యను కంట్రోల్లో పెట్టాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో హీరోయిన్గా సెటిల్ అయ్యిది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుని నటిగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిపోయింది లావణ్య. గత 6 సంవత్సరాలుగా వీరిద్దరూ ఒకరినిఒకరు ప్రేమించుకుంటున్నారు. రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని పెళ్లికి రెడీ అయ్యింది ఈ ప్రేమ జంట. ఇదిలా ఉంటే గతంలో లావణ్యకు, వరుణ్‌కు మధ్య పెద్ద గొడవ జరిగిందట. ఆ గొడవకు కారణం విజయ్ దేవరకొండ అని టాక్ వినిపిస్తోంది.
విజయ్, రష్మికలు నటించిన ఓ చిత్రంలో ముందుగా డైరెక్టర్ పరుశురాం లావణ్యను సంప్రదించాడట. కథ నచ్చడంతో లావణ్య ఈ విషయాన్ని వరుణ్ కి చెప్పిందట. అయితే విజయ్ దేవరకొండ సినిమా అంటే కచ్చితంగా లిప్ లాక్ ఉంటుందని ఆ సినిమాకు వరుణ్ నో చెప్పాడట. నా కెరీర్‌కి ఈ సినిమా ప్లస్ అవుతుందని లావణ్య చెప్పినా వరుణ్ వినలేదట. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ జరిగిందట. ఈ విషయంలో లావణ్య కాస్త తగ్గి వరుణ్ మాట విని సినిమాను కూల్ గా రిజెక్ట్ చేసిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి విజయ్, రష్మికలు నటించిన సినిమా మంచి హిట్ అయ్యింది. వీరిద్దరూ స్టార్ హీరో హీరోయిన్లుగా మారారు. ఒకవేళ ఇదే సినిమాలో లావణ్య కనుక నటించి ఉంటే అమ్మడి లక్ వేరేలా ఉండేదని ఈ వార్త విన్నవారు అంటున్నారు.