ముగిసిన రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు

Update: 2023-06-19 16:28 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ బోరబండ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్‌ తండ్రి చివరి కర్మలను పూర్తి చేస్తారు. రాకేష్ మాస్టర్ చివరి చూపు కోసం పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. అతడి శిష్యులైన టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ శేఖర్, జానీ మాస్టర్లు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకు ముందు వారు తమ గురువు పాడెను మోశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్స్‌ రాకేష్‌ మాస్టారి దగ్గరే డ్యాన్స్‌ పాఠాలు నేర్చుకున్నారు. వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే వీరిపై రాకేష్ మాస్టర్ పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.తీవ్ర పదజాలంతో వారిని దూషించేవారు. ఈ విషయంపై శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్ ఎప్పుడూ స్పందించలేదు. దీంతో రాకేష్ మాస్టర్ కడసారి చూపుకోసం వస్తారా? లేదా? అన్న సందేహాల నడుమ రాకేష్ మాస్టర్ సోమవారం రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్లి.. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు.






 


 


Tags:    

Similar News