Hi Nanna : హాయ్ నాన్నకు అవార్డుల పంట..బిహైండ్‌వుడ్స్ బెస్ట్ యాక్టర్గా నాని

Update: 2024-02-13 03:24 GMT

ప్రతిష్టాత్మకమైన బిహైండ్‌వుడ్స్ (Behindwoods) గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ ఈవెంట్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, హీరోలు పాల్గొన్నారు. హీరో నేచురల్ స్టార్ నాని (Nani) రీసెంట్ గా నటించిన హాయ్ నాన్న(Hi Nanna) మూవీకి అవార్డుల పంట వరించింది. పలు విభాగాల్లో మూడు అవార్డులు లభించాయి. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన హాయ్ నాన్న మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇందులో హీరో నాని యాక్టింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. హీరోయిన్ గా మృణాల్ రెండో భారీ హిట్ అందుకుంది. మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ అయినప్పటీకి దాని కలెక్షన్ల ప్రభావం దీనిపై పడలేదు. దీంతో నాని మరో కమర్షియల్, క్లాసీకల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.




 


తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీకి 3 అవార్డులను గెలుచుకుంది. హాయ్ నాన్నలో తన పాత్రకు ప్రశంసలు అందుకున్న నాని, ది బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ యాక్టర్ ఇన్ ఎ లీడ్ రోల్ 2023 అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ఈ మూవీలో తన అద్భుతమైన నటనకు గాను మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు. అంతేగాక హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ (Shouryuv) 2023 బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫిల్మ్‌మేకర్‌ అవార్డ్ ని గెలుచుకున్నారు. ఇదిలాఉండ‌గా హాయ్ నాన్న చిత్రం థియేటర్లలో యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకోగా, OTTలో విడుదలైన తర్వాత కూడా టాప్ ట్రెండ్ లో నిలిచింది. అదే వేదిక‌పై యానిమ‌ల్ సినిమాకు బెస్ట్ డైరెక్ట‌ర్ అవార్డు సందీప్ రెడ్డి వంగా గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి వంగాకి బెస్ట్ డైరెక్టర్ గా నాని అవార్డును అందించారు. 




 




Tags:    

Similar News