తన సహజసిద్ధమైన నటనతో సింగింగ్ టాలెంట్‌తో అతి కొద్ది కాలంలోనే మలయాళ కుట్టీ నిత్యా మీనన్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ నటించి తిరుగులేని హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది నిత్యా. ఇప్పుడు తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కామాంధులు అన్ని చోట్ల ఉంటారని, తనను ఓ హీరో లైంగికంగా వేధించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది . దీంతో ఇప్పుడు నిత్యా మీనన్ వ్యాఖ్యలపై నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. తొలి సినిమాలోనే తనదైన నటనతో అందరినీ ఫిదా చేసేసింది నిత్యా. ఆ తరువాత తెలుగులో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. నటనకు తోడు తనలోని మరో టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ బ్యూటీ. కొన్ని సినిమాల్లో పాటలు పాడి మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌ను కొట్టేసింది.
ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఈ క్రమంలో లేటెస్టుగా నిత్యా మీడియా ముందు తనకు ఎదురైనా చేదు అనుభవాలను చెప్పింది. ఇంటర్వ్యూలో నిత్యా మాట్లాడుతూ" కామాంధులు అన్ని పరిశ్రమల్లోనూ ఉంటారు. టాలీవుడ్లో ఇప్పటి వరకు నేను ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. కానీ తమిళంలో మాత్రం ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు. నన్ను అసభ్యంగా తాకాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు" అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. దీంతో నిత్యా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.