టాలీవుడ్ హీరో, శ్రీహరి సోదరుడి కొడుకు ధనుష్ రఘుముద్రి, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం తంత్ర. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని నరేష్ బాబు, రవి చైతన్యలు నిర్మించారు. శ్రీనివాస్ గోపిశెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
కథ ఏంటంటే:
చిన్నతనంలోనే హీరోయిన్ అనన్య నాగళ్ల (రేఖ) తల్లిని కోల్పోతుంది. అప్పటి నుంచి తండ్రి ఎప్పుడూ తిడుతూనే పెంచుతుంటాడు. అయితే చిన్నతనం నుంచి ఫ్రెండ్‌గా ఉన్న మన హీరో ధనుష్ రఘుముద్రి (తేజా)ను ఇష్టపడుతూ ఉంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే అనన్యకు దెయ్యాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమెపై ఎవరో క్షుద్రపూజలు చేసుంటారు. దానిని హీరో గమనిస్తాడు. ఆ ఊరికి 18 ఏళ్ల తర్వాత వంశీ అనే వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చినప్పటి నుంచి హీరోయిన్‌కు కష్టాలు మొదలవుతాయి. ప్రతి పౌర్ణమి రోజున అనన్య దగ్గరికి రక్తదాహంతో తపించే ఓ పిశాచి వస్తుంటుంది. వారి కథ మధ్యలో హీరోయిన్ సలోని ఎంటర్ అవుతుంది. అసలు సలోనికి అనన్యకు సంబంధం ఏంటి. పౌర్ణమి రోజున ఏం జరుగుతుంది? అనన్య పిశాచితో స్నేహం చేస్తుందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హర్రర్ మూవీ అంటే కచ్చితంగా భయపెట్టాలి. కానీ ఈ మూవీలో అలా భయపెట్టే సీన్స్ అసలుకే లేవు. దీంతో ఆడియన్స్‌కు కాస్త విసుగు వస్తుంది. మూవీ ప్రారంభంలో రామాయణంలో రావణుడి కొడుకు గురించి చెబుతారు. ఇంద్రజిత్తు చేసిన క్షుద్రపూజలు, వాటిని లక్ష్మణుడు అడ్డుకున్న తీరును చెబుతూ స్టార్ట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత కథను ఆరు భాగాలుగా చూపించారు. రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి అంటూ మూవీని కొన్ని విభాగాలుగా చూపిస్తారు. హర్రర్ సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటి వివరణలు చెప్పడం అస్సలు సెట్ కాదు. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్‌కు ముందు ట్విస్ట్ బావుంటుంది. మొత్తానికి హీరోయిన్ అనన్య నాగళ్ల తన అందం, యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. స్టోరీ పాయింట్ బావుంది. కానీ హర్రర్ మూవీ చూడాలనుకునే ఆడియన్స్‌కు కాస్త బోర్ కొట్టిస్తుంది.
Mic Tv రేటింగ్: 2/5