అదిరిపోయే థ్రిలర్ సినిమా 'కలియుగ పట్టణంలో'

Byline :  Shabarish
Update: 2024-03-25 10:29 GMT

టాలీవుడ్ హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ ఆయూషి పటేల్ నటించిన చిత్రం 'కలియుగ పట్టణంలో'. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీని డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 29వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు నరేన్ రామ మీడియాతో మాట్లాడారు. గుమ్మడి మనవడైన నరేన్ రామ మాట్లాడుతూ..ఈ మూవీ మంచి థ్రిల్ ఇస్తుందన్నారు.

హీరో విశ్వ కార్తికేయ ఇది వరకూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశానని, ఇప్పుడు హీరోగా చేస్తున్నానని అన్నారు. ఈ మూవీ నిర్మాతలు నాని, మహేష్ తనకు చాలా క్లోజ్ అని, సొంత బ్రదర్ లాగా చూసుకున్నారన్నారు. ఈ మూవీలో టైటిల్ సాంగ్, అమ్మ సాంగ్ తనకు బాగా నచ్చాయన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ మంచి సంగీతం అందించారన్నారు. ఇటువంటి థ్రిల్లర్ మూవీని అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారన్నారు.

మార్చి 29న ఈ మూవీ రిలీజ్ కానుందని, ట్రైలర్స్‌తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యిందన్నారు. 'కలియుగ పట్టణంలో' మూవీ షూటింగ్ కోసం తాను ఫస్ట్ టైం కడపుకు వెళ్లానని, అక్కడే ఎక్కువ భాగం షూట్ జరిగిందన్నారు. కడప అంటే ఫ్యాక్షన్ అని అందరూ అంటారని, కానీ అక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉందన్నారు. త్వరలోనే తాను హీరోగా తెలుగులో WHO మూవీతో వస్తున్నానని తెలిపారు.

Tags:    

Similar News