మాస్ యాక్టింగ్ అనగానే మనకు గుర్తొచ్చే హీరో మాస్ మహారాజా రవితేజ. రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను ఈ మంగళవారం రిలీజ్ చేసారు. ఈ సాంగ్ రవితేజ ఇమేజ్ కి తగట్టే మాస్ బాక్గ్రౌండ్లో కనిపించింది. ఈ పాట హీరో సొంత ఊర్లో ప్రతి ఏటా ఆనవాయితీగ జరిగే కాళీమాత జాతర సందర్భంగా వచ్చే పాటలాగా అనిపించింది .ఈ సాంగ్లో రవితేజ తాను ఎప్పుడు కనిపించని ఒక్క కొత్త లుక్ లో కనిపించాడు. కుర్తా లుంగీలో ఉన్న రవితేజ స్టైల్ కూడా ఈ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పాటలోని కొన్ని హుక్ స్టెప్స్ కి కూడా సెట్ ఐయ్యేలా ఉంది. ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట పాడాడు. దేవ్ జాన్ డి సంగీతం అందించాడు. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాసారు . సాంగ్ మధ్యలో ఒక ర్యాప్ బీట్ ఉంది. ఇక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ సింపుల్ గా ఉన్నా సరే మంచి ఊపునిచ్చేల ఉన్నాయ్.
రవితేజ్ సరసన అనుపమా పరమేశ్వర్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదల కాబోతోంది.