బతికే ఉన్నాను.. ఛాన్స్‌లు ఇవ్వండి..ఆశిష్ విద్యార్థి షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆశిష్ విద్యార్థి ఎంతో పాపులర్ అయ్యారు. ‘పాపే నా ప్రాణం’ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో మూవీస్ చేసి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇక ఈ మధ్యనే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కనిపించిన ఆయన ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఆనాడు ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా దూసుకుపోయిన ఆశిష్ విద్యార్థి నేడు సినిమా అవకాశాల కోసం చూస్తున్నాడు. ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను బతికే ఉన్నానని, తనకు కూడా అవకాశాలు ఇవ్వండని చెప్పారు. తనను గుర్తించి ఆఫర్ల ఇవ్వాలని నెట్టింట కామెంట్లు చేశాడు.
ఆశిష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు ఇలాంటి స్థితికి రావడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాలం కలిసి రాకపోతే అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.