నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. తన అభిమాన నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ రోజు గురుపౌర్ణమి సందర్భంగా.. పలు ఆలయాలతోపాటు.. ఆయా గురుకులాలు, పాఠశాలల్లో గురువులకు విద్యార్థులు భక్తితో పూజిస్తుండగా.. బండ్ల గణేశ్ సైతం తన గురువుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తాను ఎంతగానో అభిమానించే నటుడు పవన్ కళ్యాణ్ కు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
"గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను అనీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను. నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేశ్" అంటూ ట్వీట్ చేశారు.
గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి…
— BANDLA GANESH. (@ganeshbandla) July 3, 2023