Nani New Movie Title : నాని కొత్త మూవీ టైటిల్ ఇదే.. ఏం అరాచకం భయ్యా!
‘దసరా’ సినిమాతో మాంచి హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ఈ దసరా పండగ రోజున హల్ చల్ చేస్తున్నాడు. అతని కొత్త మూవీ టైటిల్‌ను సోమవారం విడుదల చేశారు. డీవీవీ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాణంలో, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రం గ్లింప్స్ మహా అరాచకంగా ఉంది. నానిని ఎవరో ఒక గదిలో బంధించగా అతడు గొలుసులను సూపర్‌మేన్‌లా తెంచుకుని నిప్పు పెట్టి బయటికి వస్తున్నాడు. గొలుసులను కత్తిపీటతో తెంచుకుని సీరియస్ లుక్స్‌తో బయటికి వస్తాడు. సాయికుమార్ వ్యాఖ్యానం సినిమా కథ సారాంశాన్ని చెబుతుంటుంది. జేక్స్ బిజోయ్ సంగీతం గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. గ్లింప్స్‌ను బట్టి చూసే పక్కా మాస్ సినిమా అనిపిస్తోంది. ఏదో బలమైన బ్యాక్ గ్రౌండ్‌తో వైలంట్ కంటెంట్‌తో కథను తీర్చిదిద్దారు. మాస్ ఎంటర్టైన్‌మెంట్ మసాలా దట్టించి వదలబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నాని పక్కన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ శర్వానంద్ ‘శ్రీకారం’లో నటించింది. ‘సరిపోదా శనివారం’ నానికి 31వ సినిమా.