Actor Navdeep : ఈడీ విచారణకు హాజరైన నవదీప్.. డ్రగ్స్ కేసులో..
నటుడు నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో నటుడు నవదీప్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో తెలిపింది. డ్రగ్స్ కేసులో ఈడీ ఈ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్కు సంబంధించిన లావాదేవీలపై అధికారులు నవదీప్ను ప్రశ్నించనున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఆయన్ను నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారించారు. సెప్టెంబర్ 23న ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు నవదీప్ను అధికారులు విచారించారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రాంచందర్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. గతంలో డ్రగ్స్ తీసుకున్నానని.. ఇప్పుడు వాటికి దూరంగా ఉన్నట్లు అప్పట్లో విచారణ సందర్భంగా నవదీప్ చెప్పారు. గతంలో సిట్, ఈడీ విచారణను సైతం నవదీప్ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఈడీ నవదీప్ను విచారించడం చర్చనీయాంశంగా మారింది.