Amala Akkineni : నాగార్జున పాటకు అమల డ్యాన్స్ స్టెప్పులు.. వీడియో వైరల్

Byline :  Veerendra Prasad
Update: 2023-09-04 04:04 GMT

అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీలో జరిగిన ఓ వేడుకలో నాగార్జన భార్య, నటి అమల డ్యాన్స్‌ చేసి అలరించారు. నాగార్జున సూపర్‌ హిట్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ చేశారు. ఆయన నటించిన ‘హలో బ్రదర్‌’లోని ‘ప్రియ రాగాలే’ పాటకు ఆమె కాలు కదిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మీ గ్రేస్‌, డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అద్భుతం మేడం.. అప్పుడెలా ఉన్నారో.. ఇప్పటికి కూడా అంతే అందంగా ఉన్నారు అని కామెంట్స్‌ చేస్తున్నారు.




 


టాలీవుడ్‌లో ఆదర్శ దంపతులు జాబితాలో ముందు వరుసలో ఉంటారు నాగార్జున-అమల. వీరద్దరూ తమ కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అయితే వారు ముందుగా వెండితెరపై జోడిగా నటించిన మొదటి సినిమా ‘కిరాయిదాదా’. ఆర్వాత వీళ్లిద్దరు తమ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో జోడిగా నటించారు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి.. వీరద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమల సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. కుటుంబ బాధ్యతలు, బ్లూ క్రాస్‌ పర్యవేక్షణ మాత్రమే కాక.. యాక్టింగ్‌ స్కూల్‌ బాధ్యతలు కూడా చూసుకుంటూ బిజీగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ప్రస్తుతం సెలక్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.




Tags:    

Similar News