కోర్డులో సరెండర్ అయిన బద్రి మూవీ హీరోయిన్

Update: 2023-06-17 14:30 GMT

అమీషా పటేల్.. బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత నాని, నరసింహుడు వంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేసింది. తాజాగా ఈ అమ్మడు కోర్టు మెట్లక్కింది. చెక్ బౌన్స్ కేసులో ఆమె రాంచీ కోర్టులో సరెండర్ అయ్యింది. ఆ తర్వాత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

సినీ నిర్మాత, వ్యాపారవేత్త అజయ్‌ కుమార్‌ అమీషా పటేల్‌పై చెక్‌ బౌన్స్‌ కేసు వేశాడు. సినిమా నిర్మిస్తానంటూ అమీషా తన దగ్గర రూ.2.5 కోట్లు అప్పుగా తీసుకుందని చెప్పాడు. ఆ తర్వాత ఆమె సినిమా పూర్తిచేయలేదని.. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును కోరాడు.

ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏప్రిల్‌ 6న అమీషాకు వారెంట్‌ ఇష్యూ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ కోర్టులో లొంగిపోయింది. అనంతరం కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో కోర్టు బయటికి వచ్చిన అమీషా.. మీడియాను చూసి ముసుగు కప్పుకుని వెళ్లిపోయింది.

Actress Ameesha Patel surrenders in cheque bounce case

Ameesha Patel,bollywood Actress,tollywood,badri,pawan kalyan,mahesh babu

Tags:    

Similar News