నా డబ్బు..నా ఇష్టం..నీకేంట్రా నొప్పి...మంచు లక్ష్మి

Byline :  Aruna
Update: 2023-09-23 04:35 GMT

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా..తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‎ను దక్కించుకుంది మంచు లక్ష్మి. విషయం ఏదైనా సరే ఏమాత్రం మొహమాటపడకుండా తన అభిప్రాయం ఏమిటో ముక్కుసూటిగా చెప్పేస్తుంటుంది. సోషల్‌ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ డేర్ అండ్ డాషింగ్ మహిళగా పేరు సంపాదించుకుంది. అందుకే నెట్టింట్లో మంచు లక్ష్మిని ఫాలో అయ్యేవారు చాలా మందే ఉన్నారు. ఆమె పనులకు ఫిదా అయ్యేవారు ప్రశంసలతో నిత్యం ఆమెను ముంచెత్తుతారు. అలాగే కొన్నిసార్లు నెటిజన్లు ఆమెపై నెగటివ్‌ కామెంట్లు కూడా చేస్తుంటారు. అలాంటి ఘటనే మంచు లక్ష్మీ తాజగా ఎదురైంది. దీంతో ఓ రేంజ్‎లో ట్రోలర్స్‏కు ఇచ్చిపడేసింది లక్ష్మి.

ఇంతకీ విషయం ఏమిటంటే..ఈ మధ్యనే లక్ష్మి ఫ్లైట్ ఎక్కేందుకు ముంబై వెళ్లింది. అయితే అక్కడ నేలమీద వేసివున్న కార్పెట్‌ అపరిశుభ్రంగా ఉండటం లక్ష్మి గమనించింది. దీంతో ఆ కార్పెట్ వీడియో తీసి ఎయిర్‌ ఇండియాను ఉద్దేశించి తన ట్విటర్ అకౌంట్లో ఒక ట్వీట్‌ షేర్ చేసింది. ఎయిర్‌ ఇండియా ఫ్లైట్ ఎక్కేందుకు బిజినెస్‌ క్లాస్‌ వాళ్లు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ ప్రశ్నిస్తే, వారు సింపుల్‎గా నవ్వి ఊరుకున్నారని మంచు లక్ష్మి తెలిపింది. పరిశుభ్రత అనేది పాసింజర్ల హక్కు అని ఆమె తెలిపింది. ఈ ట్వీట్‎కు ఎయిర్‌ ఇండియా కూడా స్పందించి, విచారం వ్యక్తం చేసింది.

అయితే నెటిజన్లు మాత్రం మంచు లక్ష్మిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ట్విటర్ వేదికగా ట్రోరల్స్‎కు గట్టి కౌంటర్ ఇచ్చింది మంచు లక్ష్మి. " ఈ మధ్యనే నేను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్‌ శుభ్రంగా లేదని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాను. నా ఐఫోన్‌తో తీసిన ఫొటో కావడం వల్ల కార్పెట్ ఎలా ఉందో చాలా స్పష్టంగా కనపడుతోందని అన్నాను. అంతే చాలామంది నాకు కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ‘ఓహో.. నువ్వు బిజినెస్‌ క్లాస్‌లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్‌ ఉందా’ అంటూ నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నాకు నచ్చలేదు. ఇందతా నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేంట్రా నొప్పి? నువ్వేమైనా నాకు మనీ ఇస్తున్నావా? నేను ఐఫోన్‌ వాడితే ఏదో పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతారేంటి. అవును నికు ఓ పర్సనల్ ఫ్లై కావాలని ఉంది. ఏం మీకు వద్దా? మీరు పెద్దగా ఆలోచించరా? అన్నింట్లో మీకు తప్పులే కనిపిస్తాయా? నువ్వేదో నాకు డబ్బులు ఇస్తున్నట్లు ఫీల్ అవుతున్నావు. ఒక మహిళ ఏమీ మాట్లాడకూడదు, చెప్పకూడదు, చేయకూడదు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టకూడదు. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి..? ఇందంతా సంపాదించేందుకు నేను ఎంతో కష్టపడతాను. ఎవరికీ ఫ్రీగా మనీ రావు. మా పేరెంట్స్ కూడా నాకు డబ్బులు ఇవ్వరు. వారు మాకు ఎలా కష్టపడి సంపాదించాలో మాత్రమే నేర్పించారు" అంటూ మంచు లక్ష్మి ట్రోలర్స్‎కు దిమ్మతిరిగే కైంటర్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 




Tags:    

Similar News