Actress Poonam Kaur : గుంటూరుకారం దర్శకుడిపై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల కానుంది. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో మూవీ ఇదే కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
ఈ క్రమంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తీశారనే టాక్ వినిపిస్తోంది. యద్దనపూడి సులోచనరాణి రాసిన ఈ నవలలో... ఒక సంగీత కళాకారిణి జీవితంలో తలెత్తిన సమస్యలను కథానాయకుడు ఏ రకంగా పరిష్కరించాడనేది కథాంశం. దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది. ఆ నవలనే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో తెరకెక్కించారని చెబుతున్నారు. దీనిపై ఓ వెబ్‌సైట్ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌కు ప్రముఖ నటి పూనమ్ కౌర్ రిప్లై ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడని, అందులో నుంచి అంతే సామర్థ్యంతో బయటపడగలడని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించారు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడని, కొందరు గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారని ట్వీట్ చేశారు. గత ప్రభుత్వాల సీఎంల కార్యాలయాలకు- ఆయనకు ప్రత్యేక అనుబంధం ఎలా ఏర్పడిందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుందని సెటైర్లు వేశారు. వ్యంగ్యాస్త్రాలు సంధించింది.