హీరోలకు మించిన ఎనర్జిటిక్ డ్యాన్సులు, చక్కని కళ్లతో టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌ను కూడా ఒక దున్ను దున్నేసి నిన్నటి తరం నటి రాధ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. ఆమె పెద్ద కూతురు కార్తీక పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. రోహిత్ మీనన్ అనే యువకుడితో కలసి దిగిన ఫోటోలను కార్తీక సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగులో నాగచైనత్య సరసన ‘జోష్’లో, జూ. ఎన్టీఆర్‌తో ‘దమ్ము’లో నటించిన కార్తీక తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో ఎంచక్కా పెళ్లి చేసుకుని సెటిలైపోదామని నిర్ణయానికి వచ్చింది. ఇదివరకు తను ప్రేమలో ఉన్నట్లు రోహిత్ ఫొటోలను బ్లర్ చేసి చూపిన కార్తీక ఇప్పుడు ముసుగు తొలగించింది.
కాబోయే భర్త ఫొటోలను షేర్ చేసిన కార్తీక ‘‘నిన్ను కలుసుకోవడం ఓ అదృష్టం. నీతో ప్రేమలో పడడడం ఓ మాయ. మన జీవితానికి కౌంట్ డౌన్ మొదలైంది’’ అని రాసుకొచ్చింది. రోహిత్ మీనన్ పేరు బట్టి అతడు కూడా కార్తీక తల్లిదండ్రుల మాదిరే మలయాళీగా భావిస్తున్నారు. అతని వివరాలేంటో సరిగ్గా తెలియడం లేదు. కార్తీక సినిమాలు మానేసి ఎనిమిదేళ్లవడంతో ఆమెను జనం గుర్తించుకునే పరిస్థితి లేదు. రాధ రెండో కూతురు తులసి కూడా కొన్ని చిత్రాల్లో నటించినా తర్వాత ఆఫర్లు రాక ఇంటికే పరిమితమైంది.