పవన్ కల్యాణ్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

Update: 2023-08-10 11:17 GMT

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గురించి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ ఆసక్తిక విషయాలు వెల్లడించారు. పవన్ కల్యాణ్‎తో వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయి..బాదపడ్డాను. కానీ ఆ కథ ముగిసిపోయిందన్నారు. దయచేసి రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలను, పిల్లలను లాగొద్దని కోరారు. పవన్ కల్యాణ్ అరుదైన వ్యక్తి అంటూ రేణు దేశాయ్ చెప్పారు. రాజకీయంగా తన మద్దతు పవన్ కల్యాణ్‎కు ఉంటుందని వ్యాఖ్యానించారు.

" ఆయన సమాజసేవ కోసం ముందుకొచ్చారు. పవన్ డబ్బు మనిషి కాదు. పేదవాళ్ల కోసం నిరంతరం ఆలోచిస్తారు. ఆయనకు పొలిటికల్‎గా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాను. నాకు చేతనైనంత నేను చేస్తున్నాను. ఇలా ఈ వీడియో చేస్తున్నది కూడా అదే. కుటుంబాన్ని.. సొంత పిల్లల్ని కూడా కాదనుకుని.. లగ్జరియస్ లైఫ్ వదులుకుని.. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా ఆయన సేవను గుర్తించి..అండగా నిలబడండి" అని రేణు దేశాయ్ పిలుపు నిచ్చారు.

బ్రో సినిమా వివాదం సందర్భంగా పవన్ పెళ్లిళ్లపై సినిమాలు, వెబ్ సిరీస్ లు తీస్తామన్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై కూడా రేణుదేశాయ్ స్పందించారు. "పవన్ పెళ్ళిళ్ళ మీద వెబ్ సిరీస్, సినిమాలు తీస్తామని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు..అలా చేయడం కరెక్ట్ కాదని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఆడవాళ్లని..పిల్లలను దయచేసి లాగొద్దని కోరారు" ప్రస్తుతం రేణు దేశాయ్ వీడియో వైరల్‎గా మారింది.

ప్రతిసారీ పవన్ మూడు పెళ్లిళ్లు, రేణు దేశాయ్ పేరు ప్రస్తావిస్తూ వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయంపై రేణుదేశాయ్ స్పందిచడం, పవన్‎ కు మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News