సమంత ఈవెంట్లో చైతూ సాంగ్.. ఆమె ఎక్స్ప్రెషెన్స్ చూస్తే....

By :  Lenin
Update: 2023-08-18 09:36 GMT

సమంత - నాగ చైతన్య.. ఏం మాయ చేశావే మూవీతో కలిసిన ఈ జంట ఆ తర్వాత ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొన్నాళ్లకే విడిపోయారు. వీరు విడిపోయిన వీళ్ల మీద వార్తలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఓ రూపంలో ఈ జంట వార్తల్లో నిలుస్తోంది. తాజాగా జరిగిన ఖుషి మ్యూజిక్ కన్సర్ట్లో స్టేజీపై మజిలీ మూవీ సాంగ్ వచ్చింది. ఈ సందర్భంగా సమంత ఎక్స్ప్రెషెన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

సామ్ - చైతూ కెరీర్లోనే మజిలీది స్పెషల్ ప్లేస్. ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో ఈ చిత్రంలోని ప్రియతమా.. ప్రియతమా.. సాంగ్ను సింగర్స్ స్టేజీపై పాడారు. ఈ సమయంలో సామ్ భావోద్వేగానికి గురైనట్లు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. సాంగ్ వింటున్న సమయంలో ఆమె తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సామ్.. మాజీ భర్తను ఇంకా మరిచిపోలేదు అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక సమంత - విజయ్ దేవరకొండ నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాద దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ సహా సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం నిర్వహించిన ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో విజయ్ - సామ్ తమ డ్యాన్స్తో అందరినీ మెస్మరైజ్ చేశారు.

Tags:    

Similar News