ఫిదా మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి శరణ్య. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి అక్కగా ఫిదాలో నటించి మంచి పాపులారిటీ సంపాందించుకుంది. అయితే ఇటీవల సుహాస్ హీరోగా నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో శరణ్య నటించింది. ఈ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఇందులో శరణ్య పాత్రకు చాలా క్రేజ్ వచ్చింది. అయితే ఇందులో ఆమె నటనకు చాలా ప్రశంసలతో పాటు మరికొందరు విమర్శలు కూడా చేశారు.
ఈ మూవీలో ఓ సీన్ లో ఆమె న్యూడ్ గా నటించింది. శరణ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని న్యూడ్ గా నటించినట్లు చెప్పడంతో అంతా విని షాక్ అయ్యారు. దీంతో ఆమె విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై స్పందించిన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ మూవీలో న్యూడ్‌గా నటించినందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఎందుకంటే తన భర్త ప్రోత్సాహంతో పాటుగా డైరెక్టర్ కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సీన్ తీసారని చెప్పుకొచ్చారు. అంతా అనుకున్నట్లుగా రావడంతో ఎలాంటి సమస్య రాలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ కొందరు మాత్రం తాను ఇంకేదో ఆశించి అలా న్యూడ్‌గా నటించానని చర్చించుకోవడం, పలు సైట్లు దారుణంగా రాయడం బాధగా అనిపించిందన్నారు. అలా కామెంట్స్ చేసే వారు చూసే విధానాన్ని మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే ప్రస్తుతం శరణ్య కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.