Actress Surekha : గుండుతో సురేఖ వాణి.. నెట్టింట ఫొటోలు వైరల్.. అసలు విషయం ఏంటంటే?

Byline :  Bharath
Update: 2024-01-08 16:25 GMT

టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీ పాత్రల్లో నటించి మెప్పించింది. క్యారెక్టర్ ఆర్టిస్టే అయినా.. చాలామంది అభిమానులను ఆమె సొంతం చేసుకుంది. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోపక్క సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది సురేఖ. తన కూతురుతో ఎంజాయ్ చేసే ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో సురేఖవి కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజం కాదు, మార్ఫింగ్ అని కొందరు అంటుంటే.. మరికొందరు ఫాలోవర్స్ మాత్రం నిజమైన ఫొటోలేనని క్లారిటీ ఇస్తున్నారు. ఇంతకీ అవేంటంటే..

సురేఖ వాణి గుండుతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎవరో ఆకతాయిలు కావాలనే మార్ఫింగ్ చేశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. అవి నిజమైన ఫొటోలే. ఇటీవల సురేఖ తన కూతురితో తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నడక మార్గంలో కొండపైకి చేరుకున్నారు. అలాగే శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించింది సురేఖ. దర్శనం పూర్తయ్యాక బయటికి వస్తుంటే.. ఆమె అభిమానులు సురేఖను ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో సురేఖ గుండు చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.








Tags:    

Similar News