ది కేరళ స్టోరీ.. సినిమాను కొందరు కల్పిత కథ అంటుంటే.. మరికొందరు యదార్థ గాధ అంటున్నారు. ఏది ఏమైనా.. పలు విమర్శల నడుమ విడుదలైన మే 5న విడుదలైన ఈ సినిమా.. మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రూ. 230 కోట్ల గ్రాస్ దాటగా.. రూ. 250 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అదా శర్మ.. సినిమాకు ఎంతలా కష్టపడిందో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘సినిమా షూటింగ్ కొంత భాగం అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. అక్కడ మైనస్ 16 డిగ్రీల్లో 40 గంటలున్నాం. డీహైడ్రేషన్ తో నా పెదాలు పగిలిపోయాయి. ఓ సన్నివేశంలో నేను కింద పడాలి. ఆ టైంలో దెబ్బలు తగలకుండా కింద పరుపు వేయాలి. కానీ, టైమింగ్ మిస్ అయింది. దాంతో నా ముఖానికి దెబ్బలు తగిలాయి. ఏదైతేనేం మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది’అంటూ రాసుకొచ్చింది.
మరో పోస్ట్ లో కుక్కతో ఉన్న సీన్ పోస్ట్ చేసింది. అందులో ‘ఇషాన్ నన్ను కొట్టడానికి వచ్చే సీన్ అది. ఆ సీన్ అంతా ఓ కుక్క దగ్గరుండి చూసింది. సీన్ అయిపోయాక నన్ను చూడటానికి దగ్గరికి వచ్చింది. అప్పటికే సీన్ కోసం ఏడ్చి ఏడ్చి ఉన్నా. పైగా ప్రెగ్నెంట్ గెటప్ నాది. తిరిగి తిరిగి కాళ్లు నొప్పి పుట్టాయని కూర్చున్నా. అంతే ఆ కుక్క వచ్చి నా ముందు నిల్చోగానే హగ్ చేసుకున్నా’ అంని చెప్పింది.