'ఆదిపురుష్'‎ జస్ట్ యావరేజ్' మాత్రమే...వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

Update: 2023-06-11 06:38 GMT

పాన్ ఇండియన్ స్టార్‎గా ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది. సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్స్ తరువాత ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు డార్లింగ్. అందులోనూ బాలీవుడ్‎లో ప్రభాస్ డెబ్యూ సినిమా కావడంతో ఫ్యాన్స్‎లో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. సెలబ్రిటీల పెళ్లిళ్లు, వారి విడాకుల గురించి జోస్యం చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆదిపురుష్ సినిమాపై ఓ బాంబు పేల్చాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్‎గా మారాయి.

ఆదిపురుష్ సినిమా గురించి వేణు స్వామి మాట్లాడుతూ.." అందరూ అనుకుంటున్నట్లు ఆదిపురుష్ సినిమా భారీ హిట్ కాదు. జస్ట్ యావరేజ్‎గా ఆడుతుంది. ప్రభాస్ జాతక ప్రభావం ఈ సినిమాపై ఉంది. అందుకే భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం లేదు. అందులోనూ బాహుబలి రేంజ్‎లో మూవీ హిట్ కానేకాదు. రాముడి కథే అయినా సినిమా భారీ హిట్ సాధించే అవకాశం లేదు. ఈ సినిమాకు ప్రభాస్ ఎంత్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అన్నది అతని ఇష్టం. అందుకని ఆయన తీసిన ప్రతి సినిమా భారీ విజయం సాధించాలని ఏమీ లేదు. సాహో, రాధేశ్యామ్ సినిమాలే అందుకు ఉదాహరణ".అని సినిమాపై జోస్యం చెప్పారు వేణు స్వామి.

Tags:    

Similar News