ఆదిపురుష్ సినిమాపై వివాదం రోజురోజుకు ఎక్కువవుతోంది. దేశంలో సినిమాను బ్యాన్ చేయాలని అభిమానులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల నేపాల్ ప్రభుత్వం కూడా రామాయణాన్ని కించపరిచేలా ఉందని.. ఆదిపురుష్ తో పాటు, భారతీయ సినిమాలను బ్యాన్ చేసింది. దీనిపై స్పందించిప ఆదిపురుష్ టీం క్షమాపణలు కోరుతూ నేపాల్ ప్రభుత్వానికి లెటర్ రాసింది.
ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి పుట్టుక భారత్ లో జరిగిందని చూపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ ప్రభుత్వం సినిమా రిలీజ్ అయిన రోజే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సీన్ ను తొలగిస్తేనే సినిమాను ప్రదర్శిస్తామని పట్టుబట్టింది. రామాయణాన్ని వక్రీకరించేలా సినిమా తీశారని, మా మనోభావాలు దెబ్బతిన్నాయని అక్కడి నేతలు సినిమాపై బ్యాన్ విధించారు. దీనిపై రాజీకి వచ్చిన చిత్ర బృందం.. క్షమాపణలు కోరుతూ లెటర్ రాసింది. నిషేదాన్ని ఎత్తివేయాలని ఖాట్మండు మేయర్ ను అభ్యర్థించారు. దీనికి సంబంధించిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.