ఇక నుంచి ఏడాదికి 2,3 సినిమాలు చేస్తా... 'ఆదిపురుష్' ఈవెంట్‌లో ప్రభాస్ కామెంట్స్

Update: 2023-06-07 03:20 GMT

మంగ‌ళ‌వారం తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త‌న పెళ్లిపై ప్ర‌భాస్ ఆస‌క్తిక‌రంగా కామెంట్స్ చేశాడు. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానంటూ అభిమానుల కేరింతల మధ్య ప్రకటించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైన‌ల్‌ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుక‌లో ప్ర‌భాస్ మాట్లాడుతోండ‌గా అభిమానులు ఆయ‌న్ని పెళ్లెప్పుడూ అని అడిగారు. అభిమానుల ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ స‌మాధానం ఇచ్చాడు. తిరుప‌తిలోనే పెళ్లి చేసుకుంటాన‌ని అన్నాడు. అత‌డి స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.




 తారకరామ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద తరలివచ్చారు. అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం తరలిరావడంతో తిరుపతి గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్‌, జై సియారామ్‌ నినాదాలూ హోరెత్తాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్‌ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోనే చేసుకుంటానని పెళ్లి ఎప్పుడని అడిగిన అభిమానులతో అన్నారు. ఇక ఆదిపురుష్ సినిమా చేయడం గొప్ప అదృష్టమని చిరంజీవి చెప్పారన్నారు. 20 ఏళ్లలో ఆదిపురుష్ టీం చాలా కష్టపడటం చూశానన్నారు. ఇక నుంచి ఏడాదికి 2 లేదంటే 3 సినిమాలు చేస్తానన్నారు. స్టేజీ పై తక్కువ మాట్లాడి, ఎక్కువ సినిమాలు చేస్తానంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు.



‘‘సినిమా ఫంక్షన్‌లకు హాజరుకాని చినజీయర్‌ స్వామివారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నిర్మాత భూషణ్‌కుమార్‌ తన తండ్రి కోరిక మేరకు రామాయణం తీశారు. ఈ సినిమాను ఒక ఎమోషనల్‌గా తీసుకున్నారు. ఇందులో నాతో పాటు లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే చాలా బాగా నటించారు. ఇక కృతి సనన్‌ కూడా జానకి పాత్రలో ఎంతో బాగా నటించిందని" అన్నారు ప్రభాస్.

Tags:    

Similar News