ఆ ప్లేస్‎లో ప్రభాస్‌ను తప్ప వేరొకరిని ఊహించలేను: కృతి సనన్

Update: 2023-06-15 04:45 GMT

నేటి తరానికి శ్రీరాముడి గొప్పతనాన్ని చూపించాలనే మంచి ఉద్దేశ్యంతో అత్యంత భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు మేకర్స్. స్క్రీన్‎పైన ఆదిపురుష్ చూసే ప్రేక్షకులకు స్టన్నింగ్ విజువల్ అనుభూతిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూడాలని కొంత మంది దాతలు ఫ్రీగా టిక్కెట్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదిపురుష్‎లో సీత పాత్రను పోషించిన నటి కృతి సనన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్ ప్రభాస్‌ను ఓ రేంజ్‎లో పొగడ్తల్లో ముంచెత్తింది కృతి. అంతేకాదు ప్రభాస్ కళ్లు చూస్తే చాలు అన్నీ అర్థమైపోతాయని, ఎన్నో భావాలను పలికిస్తాయని తెలిపింది.




 


ఆదిపురుష్ సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి ప్రభాస్, కృతి సనన్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ నటులిద్దరూ ఈ విషయాన్ని కొట్టిపారేశారు. తమ మధ్య అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా కృతి ఇంటర్వ్యూ వింటే మాత్రం సమ్‎థింగ్.. సమ్‎థింగ్.. ఏదో ఉందని అనిపిస్తుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.." నేను విన్నంత వరకు ప్రభాస్ రిజర్వ్‌డ్‌గా ఉంటాడని తెలిసింది. స్టార్టింగ్‎లో అతను మాట్లాడటానికి కాస్త సిగ్గుపడ్డాడు. కానీ మాతో కాస్త ఫ్రీగా ఉండటానికి పెద్దగా సమయం ఏమీ పట్టలేదు. మేమిద్దరం మొదటగా తెలుగులో నేను నటించిన తొలి చిత్రం గురించి మాట్లాడుకున్నాము. ప్రభాస్ ఎంతో పద్ధతిగా, గౌరవంగా ప్రవర్తిస్తాడు. తన కళ్లు చూస్తే చాలా. ఎన్నో ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తాయి. ఎంతో కూల్‎గా ఉంటాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆదిపురుష్‎లో రాముడి పాత్రలో ప్రభాస్‎ని మరొకరిని ఊహించలేను" అని చెప్పుకొచ్చింది కృతి. 




 



 



 




Tags:    

Similar News