ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ , హాలీవుడ్‌లోనూ ఆదిపురుష్ మానియా కొనసాగుతోంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతోంది. బాలీవుడ్లో ఈ సంవత్సరం పఠాన్ తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ అదిపురుష్ కావడం విశేషం. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా తొలిసారి చేస్తున్న హిందీ సినిమా కావడంతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తితో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. రామాయణం కథ ఆధారంగా వస్తున్న ఆదిపురుష్ ట్రైలర్లు, టీజర్లు సినిమాకు ఓ రేంజ్ హైప్‌ను తీసుకువచ్చాయి. ఓం రౌత్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, సీతగా కృతిసనన్ కనిపించనుంది, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ మెప్పించనున్నాడు.
ఇదిలా ఉంటే ఇంకా సినిమా థియేటర్లలో విడుదల కానేకాలేదు కానీ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుందని జనాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే మొత్తం రూ. 250 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. భారీ మొత్తంలో చెల్లించి మరీ ఓటీటీ హక్కులని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అధికారికంగా ఇప్పటికే ఒటీటీ పార్ట్నర్ ని కన్ఫర్మ్ చేసింది మూవీ యూనిట్. దీంతో ఆదిపురుష్ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమ్ కాబోతోంది.
అయితే ఆదిపురుష్ సినిమాను ఒటీటీలో చూడాలంటూ మాంత్రం ఎంతలేదన్నా 50 రోజులు ఎదురుచూడాల్సిందే. సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి స్ట్రీమింగ్ డేట్స్ మారే అవకాశమూ లేకపోలేదు. అయితే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఆదిపురుష్ కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి సినిమా హిస్టరీని క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు బాలీవుడ్లో ఈ ఏడు సెన్సేషనల్ హిట్ సాధించిన పఠాన్ సినిమా రికార్డ్ ని ఆదిపురుష్ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే రెండు ఫ్లాపులతో అప్సెట్లో ఉన్న ప్రభాస్‌కు కొత్త ఊపు వచ్చినట్లేనని ఇండస్ట్రీ భావిస్తోంది. అంతే కాదు బాహుబలి 2 తరువాత ఆదిపురుష్ అతి పెద్ద విజయం కానుంది. ఎన్ని రూమర్స్ వచ్చినా , ఎవరు ఏమి అన్నా కంటెంట్ మీద నమ్మకంతో ఓం రౌత్ టీమ్ ముందుకెళ్తోంది.
Intresting update from Adipurush. digital rights bought by THIS OTT platform for a whopping Rs 250 crores