#Adipurush:'హనుమంతుడికి స్పెషల్ సీటు భక్తితో కాదు'.. రూమర్స్‌పై క్లారిటీ

హనుమంతుడి పక్క సీటు కోసం ఫుల్ డిమాండ్..!!;

Update: 2023-06-12 01:54 GMT





మరో నాలుగు రోజుల్లో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో.. ప్రభాస్ తొలిసారి పౌరాణిక చిత్రంలో నటించడంతో ఈ సినిమాపై విపరీతమైన హైప్ ఉంది. రామాయణం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి ఈనాటి వరకూ ప్రతీ విషయంలో ఆదిపురుష్.. పలుమార్లు వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో సైతం సినిమాపై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి.

ఆదిపురుష్ ను.. రామానంద్ సాగర్ రామయణంతో పోలుస్తూ.. ఓం రౌత్ సినిమాలోని పాత్రలను సరిగ్గా తెరకెక్కించడం లేదని.. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు ఇలా ఈ పాత్రల్లో నటిస్తున్న వారి గెటప్స్ సరిగ్గా లేవని వరుసగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా కానీ సినిమాపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓం రౌత్ ప్రకటిస్తూ.. ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఆంజనేయ స్వామి కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయించబడుతుందని తెలిపారు. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.




అయితే దీనిపై కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. హనుమంతుడికి స్పెషల్ సీటు.. భక్తితో కాదని.. దానిని కూడా ఆదిపురుష్ టీమ్ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది కాబట్టి హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరల్ని అధిక మొత్తంలో పెంచి విక్రయించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రూమర్ పై మూవీ టీమ్ స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవం. అలాంటి ఫేక్, ఫాల్స్ న్యూస్ నమ్మొద్దు. హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరలు కూడా నార్మల్ గానే ఉంటాయి. ఎలాంటి మార్పు ఉండదు అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.




Tags:    

Similar News