అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడ్రస్ లేని 'ఆడు జీవితం'

Byline :  Shabarish
Update: 2024-03-27 09:59 GMT

కేరళలో ఫేమస్ నవల గోట్ డేస్ ఆధారంగా తెరకెక్కిన మలయాళ మూవీ ది గోట్ లైఫ్. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ తెలుగులో 'ఆడు జీవితం' అనే పేరుతో రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి సంబంధించి నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైతే సరైన రెస్పాన్స్ కనిపించడం లేదు. థియేటర్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు ఉంది. అయినా ఆ మూవీ సందడి కనిపించడం లేదు.

చాలా భాగం ఎడారి ప్రాంతంలో షూట్ చేసిన ఈ మూవీకి తెలుగులో సరైన ప్రమోషన్స్ చేయలేదని అనిపిస్తోంది. హీరో పృథ్వీరాజ్ ఆ మధ్య సలార్‌లో ప్రభాస్ పక్కన నటించాడు. ఆ చనువుతోనైనా ప్రమోషన్స్‌లో ప్రభాస్‌ను హెల్ప్ అడుగుండాల్సింది. తెలుగులో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రెస్ మీట్ పెట్టడం మినహా ఇక ఎలాంటి ప్రమోషన్స్ వర్క్ చేయలేదు.అందుకే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినా ఎవ్వరికీ ఈ మూవీ గురించి తెలియకపోవడంతో టికెట్స్ బుక్ చేసుకోవడం లేదని అనిపిస్తోంది.

సమ్మర్‌లో వస్తున్న సినిమా కాబట్టి కాస్త హైప్ ఇచ్చుంటే సక్సెస్ అయ్యేదేమో. కానీ సోలోగానే ప్రెస్ మీట్ పెట్టి పృథ్వీరాజ్ పెద్ద తప్పు చేశాడని అనిపిస్తోంది. పైగా ఎడారిలో సాగే సీన్స్, పృథ్వీరాజ్ లుక్‌ను చూసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. సర్వైవల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ అంత బజ్‌ను క్రియేట్ చేయలేదు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'ఆడు జీవితం' అడ్రసే లేకుండా పోతుందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News