'వార్2'పై బిగ్ అప్డేట్..షూటింగ్‌లో ఎన్టీఆర్

Byline :  Shabarish
Update: 2024-03-27 13:02 GMT

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ దేవర చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత తారక్ బాలీవుడ్ మూవీ చేయనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వార్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పట్లో జరిగేలా లేదు. దేవర అయితే గానీ వార్ 2 షూట్ లోకి ఎన్టీఆర్ వెళ్లలేడు. అయితే ఆ విషయంపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.

ఏప్రిల్ నెల తర్వాతే తారక్ వార్ 2 మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. నెల రోజుల పాటు సాగే ఆ షూటింగ్‌లో కీలకమైన సీన్స్ తీస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మే నెలలోపు వార్2 మూవీ షూటింగ్‌కు సంబంధించి తారక్‌పై ఉన్న సీన్స్ అన్నీ కంప్లీట్ చేయాలని వార్2 మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఆ షూటింగ్ కూడా థాయిలాండ్‌తో పాటు ముంబై లొకేషన్స్‌లో ఎక్కువగా జరగనుంది.

దేవర పార్ట్ 1 పూర్తి అయిన వెంటనే రెండు మూడు నెలల గ్యాప్‌లో పార్ట్2 కూడా స్టార్ట్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఆలోపు వార్ 2 ఫినిష్ చేసేందుకు మేకర్స్ చూస్తున్నారు. ఇకపోతే వార్ 2 మూవీలో ఎన్టీఆర్ నెగిటిల్ రోల్ చేస్తున్నారని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం కమాండోగా కనిపిస్తున్నాడని అంటున్నారు. అయితే ఇంత వరకూ ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ రివీల్ కాలేదు. ఇదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి ఏప్రిల్ తర్వాత వార్ 2 షూట్‌లో ఎన్టీఆర్ ఉంటాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News